Site icon NTV Telugu

Perni Nani: పోలింగ్ తర్వాత హింసకు వారే కారణం.. పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడులు..!

Perni Nani

Perni Nani

Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఫైర్‌ అయ్యారు మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ వారు యథేచ్చగా కర్రలు, రాడ్లతో దాడులు చేశారు.. మా వాళ్లు ఎదురు తిరిగితే మాపై కేసులు పెడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసలకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.. పల్నాడు ఎస్పీకి ఫోన్లు చేసినా పట్టించుకోలేదు? అని విమర్శించారు.. రిటైర్డ్ అధికారిని పోలీసు అబ్జర్వర్ ని పెడితే ఏం జవాబుదారీతనం ఉంటుంది? అని నిలదీశారు.. బీజేపీ కూటమికి సహకరించమని పోలీసు అధికారులనే ఆయన బెదిరించారన్నారు. మా కార్యకర్తలపై హత్యానేరం కేసులు పెడుతున్నారు.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పినట్టు పోలీసు అధికారును మార్చినచోటే హింస జరిగింది అని ఆరోపించారు.. అంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దారుణాలకు పాల్పడ్డారు అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పేర్ని నాని.. ఇక, మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. ఇంకే ఏ అంశాలపై స్పందించారు.. ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version