Site icon NTV Telugu

Lenin: అఖిల్ ‘లెనిన్’ షూటింగ్ అప్‌డేట్..

Lenin Akhil

Lenin Akhil

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రమైన ‘లెనిన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ వారం నుంచి కీలకమైన క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో అఖిల్ తో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Also Read : Dhurandhar 2 : రికార్డ్ బ్రేకర్ సీక్వెల్ ‘ధురంధర్ 2’.. టీజర్ రిలీజ్ డేట్ లాక్!

ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, ముఖ్యంగా చిత్తూరు ప్రాంత నేపధ్యంలో సాగే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఇందులో కథానాయికగా నటిస్తుండగా, అఖిల్-భాగ్యశ్రీ మధ్య వచ్చే లవ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ప్రస్తుతం టీమ్ ఒకవైపు షూటింగ్ పూర్తి చేస్తూనే, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుతోంది. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్, ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా ధీమాగా ఉన్నారట. మరి ఈ రాయలసీమ కథతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

Exit mobile version