Site icon NTV Telugu

Periods Time Food: మహిళలకు పీరియడ్స్ సమయంలో అసౌకర్యానికి చెక్ పెట్టే పండ్ల జాబితా ఇదే!

Periods Time Food

Periods Time Food

Periods Time Food: స్త్రీలు నెలసరి సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడం ఆరోగ్య పరంగా చాలా ముఖ్యం. ఆ రోజుల్లో శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా రక్తస్రావం అధికంగా ఉండే సందర్భాల్లో శక్తినిచ్చే, రోగనిరోధకతను పెంచే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. పండ్లు ఈ విషయంలో వారికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇవి సహజ శక్తిని అందించడంలో కీలకంగా పనిచేస్తాయి. మరి అవి ఏ పండ్లు..? వాటి వల్ల ఎలాంటి ఉపయోగంలో ఒకసారి చూద్దాం..

* నెలసరి సమయంలో అరటి పండు తినడం చాలా ప్రయోజనకరం. ఇది పొటాషియం, విటమిన్ B6 లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీరంలోని ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇవి మూడ్‌ ను స్టేబిలైజ్ చేస్తాయి. ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్లు శక్తిని పెంచుతాయి, నిస్సత్తువను తగ్గిస్తాయి.

Read Also:Deputy CM Pawan Kalyan: ప్రసన్నకుమార్‌ రెడ్డి వ్యాఖ్యలపై స్పదించిన పవన్‌ కల్యాణ్‌.. చట్ట ప్రకారం చర్యలు..!

* స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీ పండ్లు యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరులు. ఇవి శరీరంలోని వాపులను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య కూడా నివారించగలవు.

* ముఖ్యంగా విటమిన్ C అధికంగా ఉండే నారింజ, ముసంబి వంటి పుల్ల పండ్లు శరీరంలో ఐరన్ శోషణకు సహకరిస్తాయి. పీరియడ్స్ సమయంలో హేమోగ్లోబిన్ స్థాయి తగ్గే ప్రమాదం ఉండడం వల్ల అలసట, బలహీనత కలుగుతుంది. అందుకే ఇవి తప్పనిసరిగా డైట్ లో ఉండాలి.

Read Also:Viral Video: అయ్యబాబోయ్.. బతికి ఉన్న బొద్దింకను అలా చేశావేంటి తల్లి.. వీడియో వైరల్

* పైనాపిల్లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గించడంతో పాటు నెలసరి సమయంలో వచ్చే నొప్పులను ఉపశమన పరచుతుంది. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.

* కివీలో విటమిన్ K, విటమిన్ E, ఫోలేట్ వంటి కీలక పోషకాలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. నెలసరి సమయంలో ఇది చక్కటి శక్తివంతమైన పండు.

వీటిని తీసుకోవడంతోపాటు ఆ సమయంలో వారు.. రోజంతా బాగా నీళ్లు తాగాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇంకా పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం, పండ్లు తినాలి. మొత్తంగా.. రుతుక్రమ సమయంలో స్త్రీలు పౌష్టికతతో కూడిన పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అటువంటి సహజమైన ఆహారం జీవితాంతం ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Exit mobile version