ఢిల్లీ మెట్రోలో ఇప్పటికీ ఎన్నో రకాలైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కొన్ని వీడియోలు నెటిజన్లకు ఇబ్బందిపెట్టించే విధంగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే కాగా.. ఈ వీడియో చూస్తే నవ్వడం ఆపుకోలేరు. ఓ వ్యక్తి నుదుటిపై సింధూరం పెట్టుకుని మెట్రో ఫ్లాట్ ఫాంపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: Justice Alok Arade: జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనాన్ని ప్రారంభించిన తెలంగాణ హైకోర్టు సీజే
ఢిల్లీ మెట్రోలో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఒకరి ముఖం ఒకరికి గుర్తుండదు. అయితే అంత తేలికగా మరచిపోలేని ఓ ఫేస్ కలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఈ వ్యక్తి సింధూరం పెట్టుకుని వెళుతున్నట్లు కనిపించాడు. అయితే ఈ వీడియోలో గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. అతని మొహం మీద కళ్ళు పెడితే నవ్వు ఆపుకోలేరు. ఈ వ్యక్తి వైరల్ కావాలనే ఉద్దేశ్యంతో నుదుటిపై సింధూరం పెట్టుకుని మెట్రో ఫ్లాట్ ఫాంపై అదో టైప్ లో నడుస్తూ తిరుగుతున్నాడు.
Read Also: Karnataka High Court: ప్రార్థనల కోసం నివాస గృహాన్ని ఉపయోగించడంపై ఎలాంటి ఆంక్షల్లేవ్..
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @abhishek_all_in_one_ అనే ఖాతాతో పోస్ట్ చేశారు. అంతేకాకుండా.. ఈ వీడియోలో ఢిల్లీ మెట్రోకు స్వాగతం అని క్యాప్షన్‌లో వ్రాశారు. ఈ వీడియోపై వార్తలు రాసే సమయానికి 1 లక్షా 96 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వింత చర్యను ప్రజలు చాలా ఆనందించారు. అంతేకాకుండా.. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.