NTV Telugu Site icon

Tomato: టమాటాల కోసం క్యూ లైన్లో.. వీడియో వైరల్

Tomato

Tomato

దేశ వ్యాప్తంగా టమాటా ధరలు దిగడం లేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలలో కిలో రూ.200 పలుకుతుండటంతో.. కొందరు టమాటను తినడమే మానేశారు. కొన్నిచోట్ల ధరలు పెరిగినప్పటికీ.. మరికొన్ని చోట్ల టమాట దొరకడం లేదు.

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు

ఘజియాబాద్‌లో ఓ టెంపోలో అమ్ముతున్న టమాటాలను విక్రయించడానికి చాలా మంది జనాలు బారులు తీరారు. మహాగుణ్ పురం సొసైటీలో చాలా మంది నివాసితులు క్యూలో నిలబడి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ విక్రయిస్తున్న టమాట ధర కిలో రూ. 130 ఉంది. అది ఆ ప్రాంతంలో సబ్సిడీ ధర కింద ఇస్తుండటంతో.. జనాలు ఎగబడ్డారు. మరోవైపు అలా కాకుండా మార్కెట్‌లో తీసుకుంటే కిలోకు రూ. 200 ఉంది. దీంతో తక్కువ ధరకు టమాటాలు విక్రయిస్తుండటంతో కొనుగోలు చేయడానికి ప్రజలు ఎగబడ్డారు. మండల పరిషత్, జిల్లా పరిపాలన మరియు మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అక్కడి ప్రజలకు సరసమైన ధరలకు టమోటాలు విక్రయించడానికి ఏర్పాట్లు చేశాయి.

Rage of Bholaa: ‘రేజ్ ఆఫ్ భోళా’తో.. అంచనాలు పెంచేస్తున్నారుగా!

ఆ వీడియోలో.. టమాటాలు కొనుగోలు చేసేందుకు మహిళలు, పురుషులు క్యూలో నిల్చున్నారు. అయితే టమాటాలు కోసం అక్కడి వారు ఎగబడటంతో.. కొందరు వీడియోలు తీశారు. ప్రస్తుతం టమాటాల కొనుగోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.