NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: ప్రజలు అధికారం ఇచ్చింది సమస్యలు పరిష్కరించాలని.. ప్రతిపక్షం మీద కేసులు పెట్టడానికి కాదు!

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

దళిత నాయకుడు, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ప్రభుత్వ మాజీ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. లేని కేసులు పెట్టడం కూటమి పార్టీ అలవాటుగా చేసుకుందని, వైఎస్ జగన్ పరిపాలనలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కేసులు పెరిగిపోయాయని, ఈ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపును తాము మౌనంగా భరిస్తున్నాం అని తెలిపారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారి సమస్యలు పరిష్కరించాలని కానీ.. ప్రతిపక్షం మీద కేసులు పెట్టడానికి, అక్రమ వసూళ్లు చేయడానికి కాదని సజ్జల విమర్శించారు.

సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ… ‘దళిత నాయకుడు నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. లేని కేసులు పెట్టడం కూటమి పార్టీ అలవాటుగా చేసుకుంది. వైఎస్ జగన్ పరిపాలనలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై కేసులు పెరిగిపోయాయి. ఒక మాజీ ఎంపీకి జైలులో కనీసం సౌకర్యం కూడా ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపును మౌనంగా భరిస్తున్నాం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు భార్య, భర్తలను అరెస్టు చేస్తున్నారు. వైఎస్ జగన్ అభిమాని ఐతే చాలు అరెస్టు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘గతంలో నక్సలైట్లను అర్థరాత్రి అరెస్టు చేసేవారు, ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలను అలాగే అరెస్టు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలో మాకు నేర్పిస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారి సమస్యలు పరిష్కరించాలని కానీ.. ప్రతిపక్షం మీద కేసులు పెట్టడానికి, అక్రమ వసూళ్లు చేయడానికి కాదు. గతం కంటే ఇప్పుడు బరితెగింపు ఎక్కువ అయ్యింది. తప్పుడు సాక్షాలు సృష్టించడం, అరెస్టులు చేయడమే కూటమి ప్రభుత్వం అలవాటుగా మార్చుకుంది. దెబ్బ తిన్న వాళ్లకు తెలుసు దెబ్బ ఎలా కొట్టాలో తెలుసు, మేము కొట్టే దెబ్బ చాలా బలంగా ఉంటుంది’ అని సజ్జల వార్నింగ్ ఇచ్చారు.