Site icon NTV Telugu

Vizag: నగ్న వీడియోలు తీసి బెదిరిస్తూ లైంగిక దాడి.. వెలుగులోకి నివ్వరపోయే నిజాలు..

Vizag

Vizag

Vizag: విశాఖపట్నంలోని ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నేవీ అధికారి కుమార్తెపై లైంగిక దాడి చేసి.. నగ్న వీడియోలు తీసి బెదిరిస్తూ మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డారు. విశాఖలోని మర్రిపాలెం పరిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు టెన్త్‌ క్లాస్‌ స్టూడెంట్. ఆమె చదువుతున్న పాఠశాలలోనే అటెండర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నగ్న వీడియోలతో కొంతకాలంగా ఆమెను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఆ వీడియోలను స్నేహితులకూ పంపాడు. దీంతో వారు కూడా బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నరని సమాచారం. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అటెండర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

సిటీలోని 104 ఏరియాకు చెందిన ఓ నేవీ అధికారి కుమార్తె సమీపంలోని స్కూల్‌లో టెన్త్‌ క్లాస్‌ చదువుతోంది. అదే స్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న సత్యారావు.. బాలిక కుటుంబం నివసించే అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నాడు. బాలికతో చనువు పెంచుకొని, డ్రాయింగ్‌ నేర్పిస్తానంటూ బాలిక ఇంటికి కూడా వెళుతుండేవాడు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు బాలికపై లైంగికదాడికి పాల్పడేవాడు. ఇంట్లో ఎవరైనా ఉంటే డ్రాయింగ్‌ పేరుతో టెర్రాస్ పైకి తీసుకెళ్లి లైంగికదాడి చేసేవాడు. బాలిక నగ్న వీడియోలు తీసి స్నేహితులకూ పంపించాడు. దీంతో వారు కూడా బాలికను బెదిరించి గతనెల 3 నుంచి 23వ తేదీ వరకూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం.

బాలిక ఇంట్లో డల్‌గా ఉంటుండటంతో ఈనెల 6న తల్లి ప్రశ్నించింది. దీంతో జరిగిన దారుణాన్ని తల్లికి వివరించింది బాధితురాలు. దాంతో అదేరోజు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు ఫిర్యాదుచేయగా, కేసు నమోదుచేసి బాలికను వైద్యపరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసును దిశ పోలీ‌స్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. దిశ ఏసీపీ వివేకానంద ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపిన పోలీసులు బాలికపై సత్యారావు లైంగికదాడికి పాల్పడినట్టు సాక్ష్యాధారాలను సేకరించారు. అతడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం షాక్‌లో ఉన్న బాలిక చికిత్స పొందుతోందని, సత్యారావు ఒక్కడే లైంగికదాడికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని ఏసీపీ చెప్పారు. ఆమెపై మరో ముగ్గురు లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదు కూడా లేదని, బాలిక షాక్ నుండి కోలుకున్నాక అసలు నిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు పోలీసులు. సమాజంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ బద్మాష్‌గాళ్లు… బడులను చెరబట్టారు. చిన్న పిల్లలు అని కూడా చూడలేదు. కామంతో కళ్లు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. పాపులర్‌ అయిన కేసులను మాత్రమే సమాజం సీరియస్‌గా తీసుకుంటోంది. బయటపడనివి అనేకం ఉన్నాయి.

Exit mobile version