NTV Telugu Site icon

AP Pensions: ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ కష్టాలు.. ఎండలో బ్యాంకుల వద్ద క్యూలు

Ap Pensions

Ap Pensions

AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. బ్యాంకు ఖాతాలకు, పెన్షన్లు జమ చేయడంతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే డీబీటీ ద్వారా వచ్చిన పెన్షన్ బ్యాంకు అకౌంట్లో పడలేదు.. ఎక్కడికెళ్ళింది.. ఏమైపోయింది.. సచివాలయానికి వెళితే బ్యాంకు ఖాతాలో పెన్షన్ పడింది.. వెళ్ళి తీసుకోండి అంటున్నారు.. తీరా బ్యాంకుకు వెళితే.. ఖాతాలో డబ్బు లేదు.. పెన్షన్ పడలేదు.. సచివాలయానికి కాళ్లీడ్చుకుంటూ ఎండలో పోవాల్సిన పరిస్ధితి.. ఏపీలో చాలా ప్రాంతాల్లో వృద్ధుల పరిస్థితి ఇలా ఉంది. పెన్షన్ ఏమైందో తెలీక వృద్ధులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. బ్యాంకులకు వెళ్లిన అలవాటు లేకపోవడంతో ఏటీఎం కార్డులు కూడా లేని వృద్ధులు కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read Also: AP Pensions: మరో ప్రాణం తీసిన పెన్షన్‌.. బ్యాంక్‌ దగ్గర కుప్పకూలి వృద్ధుడు మృతి

గత కొన్ని సంవత్సరాలుగా బ్యాంకు ఖాతాలను వాడని వారికి తిప్పలు తప్పట్లేదు. బ్యాంకు లావాదేవీలు లేకపోవడంతో ఎకౌంట్లు డీఆక్టివేట్ లేదా ఫ్రీజ్ మోడ్‌లోకి వెళ్లినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు చూపించి, మళ్లీ ఎకౌంటును యాక్టివేట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. తమ అకౌంట్లను యాక్టివేట్ చేయించుకునేందుకు బ్యాంకులకు వృద్ధులు క్యూ కడుతున్నారు. ఎండలోనే బ్యాంకులకు వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పెన్షన్లు ఇళ్లకు తెచ్చి ఇచ్చేవారని, ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామని వృద్ధులు ఆవేదన చెందుతున్నార

ఇదిలా ఉండగా.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది.. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్‌ కోసం వెళ్లి బ్యాంక్‌ ముందు కుప్పకూలిన వృద్దుడు అక్కడికక్కడే కన్నుమూశాడు.. మృతుడు సుబ్బన్న (80)గా గుర్తించారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకుకు చెందిన ముద్రగడ సుబ్బన్న.. పెన్షన్ కోసం వెళ్లి.. బ్యాంకు వద్ద కుప్పకూలి మృత్యువాత పడ్డారు. ఎండలు మండిపోతూ ఉండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాగా, గత నెల గ్రామ, వార్డు సచివాలయల దగ్గర కూడా పెన్షన్‌ డబ్బుల కోసం పడిగాపులు పడి.. కొందరు వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం విదితమే.