Site icon NTV Telugu

Panchayat Staff Under House Arrest: పింఛన్ల కోసం పంచాయతీ సిబ్బంది నిర్బంధం

Pensions

Pensions

తమకు పింఛన్లు రావడం లేదని, వెంటనే మంజూరు చేయాలని బాధితులు పంచాయతీ ఉద్యోగుల్ని నిర్బంధించారు. ఆదిలాబాద్ జిల్లాలో పింఛన్ల కోసం సర్పంచ్, సెక్రటరీని నిర్బంధించారు గ్రామంలోని బాధితులు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నాగాపుర్ లో పింఛన్ లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. తమకు పింఛన్లు రావడం లేదని సర్పంచి సెక్రటరీని కార్యలయంలోనే నిర్బంధించారు.

Read Also: Drunk And Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినందుకు దూల తీరింది.. హైకోర్టు వినూత్న శిక్ష

ఆసరా ఫించన్లు మంజూరు చేయటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్పంచితో పాటు, సెక్రటరీని పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించిన ఘటన కలకలం రేపింది. నాగాపూర్ గ్రామానికి చెందిన ఆసరా పింఛన్లు రాని బాధితులు గత నాలుగు సంవత్సరాల నుండి ఆసర పింఛన్ల కోసం అదికారుల చుట్టూ, సర్పంచ్ చుట్టూ తిరిగినా ఇంతవరకు పింఛన్ రాలేదని, కొత్తగా వచ్చిన లిస్టుల్లోను తమ పేర్లు రాలేదని ఆగ్రహనికి గురయ్యారు.

ఆర్థికంగా ఉన్న వారికి పింఛన్లు వస్తున్నాయని గ్రామపంచాయితీ ముందు ఆందోళన చేపట్టారు..ఈ సందర్బంగా వారికి నచ్చజెప్పేందుకు అక్కడికి వచ్చిన నాగాపూర్ సర్పంచి సునిల్ తో పాటు , పంచాయతీ సెక్రటరీ మనిషా ని గ్రామపంచాయితీ కార్యాలయంలో బాధితులు నిర్బంధించి తలుపుకు తాళం వేసారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఆసరా పింఛన్లు రాని వారికి పింఛన్లు మంజూరు చేయాలని సర్పంచ్ సునీల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read Also: YS Sharmila : వైయస్ షర్మిలపై స్పీకర్‌కు ఫిర్యాదు

Exit mobile version