Pemmasani Chandrashekar: ఇఫ్తార్ విందులో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pemmasani Chandrashekar: ఖురాన్ ఆవిర్భవించిన ఈ పవిత్ర మాసాన్ని రంజాన్ గా ప్రవక్త ఆదేశానుసారం కఠిన ఉపవాస దీక్షలను అవలంబించడం ముస్లింల గొప్పతనమని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక పొన్నూరు రోడ్‌లోని బీ కన్వెన్షన్ హాల్లో సోమవారం సాయంత్రం జరిగిన గుంటూరు నియోజకవర్గ ముస్లిం సోదరుల ఇఫ్తార్ ధావత్ కార్యక్రమానికి ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి రోజా విరమణ, నమాజ్, ధువా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ.. పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో ఖురాన్ గురించి తాను మూడు విషయాలు తెలుసుకున్నానన్నారు. అవి ఓర్పు – సహనం, దానగుణం, కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేయడం అని వివరించారు. అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను మైనారిటీలకు చంద్రబాబు నాయుడు అందించారని, టీడీపీ నాయకత్వంలో ముస్లింలకు భద్రత ఉందని తెలిపారు. దుల్హన్, రంజాన్ తోఫా వంటి అనేక కార్యక్రమాలతో ముస్లింలకు అండగా నిలబడిన టిడిపిని రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. అంతకు ముందు కాపు సామాజిక వర్గం నేతలతో పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు. టీడీపీ నాయకత్వంలో అన్ని సామాజిక వర్గాల ప్రజల కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!