NTV Telugu Site icon

Pemmasani Chandrashekar: గుంటూరు జిల్లా తెలుగు యువత క్యాడర్‌తో పెమ్మసాని మీట్ అండ్‌ గ్రీట్

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar

Pemmasani Chandrashekar: గుంటూరు జిల్లా తెలుగు యువత క్యాడర్‌తో గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత కదిలితే ప్రభుత్వాలు మారతాయని.. అదే యువత రగిలితే ప్రభుత్వాలు కుప్పకూలుతాయని అన్నారు. రాబోయే భవిష్యత్‌ భారత్‌దే అని ప్రపంచం అంటుందంటే కారణం.. ఈ దేశంలో ఉన్న యువతే కారణమన్నారు. యువతను సరైన మార్గంలో నడిపిస్తేనే ఆ కల నిజం అవుతుందన్నారు.

Read Also: Bandaru Satyaranarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత

రానున్న కాలంలో టీడీపీ హయాంలో అభివృద్ధి కోసం కావాల్సిన వివిధ ప్రణాళికలతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వ్యవసాయం, విద్యతో పాటు వివిధ రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. యూనివర్సిటీలు పెట్టేందుకు చంద్రబాబు హయాంలో అనుమతులు ఇస్తే వాటిని వైసీపీ సర్కారు రద్దు చేసిందని ఆయన చెప్పారు. యువత ఎంతో చైతన్యవంతులని, ప్రతి ఒక్కరు ఆలోచించాలని సూచించారు. టీడీపీ పార్టీకి సహకరించి గెలిపిస్తే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు.