NTV Telugu Site icon

Pemmasani Chandrasekhar: పొన్నూరు నియోజకవర్గంలో పెమ్మసాని రోడ్ షో..

Pemmasani

Pemmasani

పొన్నూరు నియోజకవర్గంలోని వెజేండ్ల గ్రామంలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసారి మాట్లాడుతూ.. తెలంగాణలోని హైదరాబాద్ నగరం ఒక్కప్పుడు రాళ్లు గుట్టలుగా ఉండేది.. కానీ, చంద్రబాబు చేూసిన అభివృద్ది వల్లే.. ఇప్పుడు ఒక ఎకరం భూమి వంద కోట్ల రూపాయలకు అమ్ముడుపోతుందని ఆయన తెలిపారు. అలా హైదరాబాద్ చుట్టు వచ్చిన వేలాది కంపెనీలు లక్షల ఉద్యోగాలు కల్పించి.. లక్షల మంది భవన కార్మికులు బాగుపడుతున్నారు. అలా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుంది అని పెమ్మసాని పేర్కొన్నారు. అప్పుడు చంద్రబాబు ఆదాయం సృష్టించకపోతే.. ఇప్పుడు హైదరాబాద్ గొప్ప నగరంగా ఉండేది కాదని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Read Also: Congress: బెంగాల్‌ అభ్యర్థులు ఖరారు.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారంటే!

మనం 2014-19 మధ్య ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అప్పట్లో అమరావతిని రాజధానిగా చేసుకుని అక్కడ 33 వేల ఎకరాల భూమిని తీసుకుని దాన్ని కూడా హైదరాబాద్ నగరంలాగా అభివృద్ది చేసేందుకు ప్రయత్నం చేస్తే.. జగన్ వచ్చి మొత్తం నాశనం చేశాడని ఆయన విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్ష మంది చదువుకుని బయటకు వస్తున్నారు.. వారు ఇప్పుడు ఎక్కడి పోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఇక, ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని మద్యం బ్రాండ్లను తెచ్చారు అని పెమ్మసాని చంద్రశేఖర్ మండిపడ్డారు.

Read Also: Zomato: ‘‘ప్యూర్ వెజ్ మోడ్’’ని ప్రారంభించిన జొమాటో.. వారి కోసం ప్రత్యేకం..

వైసీపీ పార్టీలో నాకు సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప ఇంకా వేరే పేరు వినపడటం లేదు అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అలాగే, దాదాపు 600 ఎకరాలను ఒక కేజీఎఫ్ సినిమా మాదిరిగా తవ్వి తవ్వి పెట్టారు.. అక్కడి నుంచి వచ్చే దుమ్ముతో రైతుల పంటాలు పూర్తిగా నాశనం అవుతున్నాయన్నారు. ఒక్కసారి అని అవకాశం ఇస్తే.. రాష్ట్రాన్ని పూర్తిగా జగన్ నాశనం చేశారన్నారు. ఇక, 40 సంవత్సరాల నుంచి ధూళిపాళ్ల కుటుంబం మిమ్మల్ని ( ప్రజలను) అంటిపెట్టుకుని ఉంటే.. వాళ్లని కాదని కిలారి రోశయ్యను తెచ్చుకున్నారు.. ఆయన మాత్రం ఇక్కడ ఉన్న వనరులను దోచుకునేందుకు మీరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ఆయన పేర్కొన్నారు. ఇక, నాపై పోటీ చేసేందుకు అందరు భయపడిపోతుంటే.. కిలారు రోశయ్యను మాత్రం వైసీపీ పోటీలో నిల్చొబెట్టింది.. ఇక్కడి పిల్లలకు గంజాయిను ఒక ఎమ్మెల్యే అలవాటు చేస్తున్నాడు అని పెమ్మసాని ఆరోపించారు. జగన్ చేసిన ఆరాచకం గురించి చాలా పెద్ద లిస్ట్ ఉందన్నారు. ప్రజలకు తీరని ద్రోహం చేసిన జగన్.. ముస్లింల సంక్షేమం కోసం ఏమైనా చేశారా అని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.