Site icon NTV Telugu

Pemmasani: తాడికొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెమ్మసాని

Pemmasani

Pemmasani

తాడికొండ నియోజకవర్గం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కొర్రపాడు, విశదల, మందపాడు, సిరిపురం, వరగాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. రాబోయేది టీడీపీ ప్రభుత్వం.. పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ అమెరికా వంటి ఇతర దేశాల్లో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో పూర్తిస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని తెలిపారు. 140 సీట్లతో టీడీపీ మెజార్టీ సీట్లతో అధికారంలోకి రాబోతుందని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.

Read Also: CM YS Jagan: నాది ప్రోగ్రెస్‌ రిపోర్ట్.. చంద్రబాబుది బోగస్‌.. డెవలప్‌మెంట్‌ కింగ్‌ ఎలా అవుతారు..?

అలాగే, పెదకాకానిలో జరుగుతున్న క్రీస్తు స్వస్తిశాల ప్రార్థనల కార్యక్రమంలో గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం నాడు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంబంధిత పాస్టర్ల నుంచి పెమసాని ఆశీర్వాదం అందుకున్నారు. ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులకు ఆ ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ అందజేస్తారని, సాటి మనుషుల మేలు కోసం ప్రయత్నించే నాయకులకు ఎప్పుడు మంచే జరుగుతుందని ఈ సందర్భంగా పాస్టర్లు తెలియజేశారు. ఈ ప్రార్ధన కార్యక్రమంలో పెమ్మసానితో పాటు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తాడికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ శాసనసభ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version