Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలు గుప్పిస్తుండగా.. వాటిపై కౌంటర్ ఎటాక్‌కు దిగుతున్నారు రాష్ట్ర మంత్రులు.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. సీఎం వైఎస్ జగన్‌ను ఎంత తిడితే ఆయనకు అంత ఆశీర్వాదం అన్నారు. గతం కంటే.. ఈ సారి ఎన్నికల్లో ఎక్కువగా వైసీపీ సీట్లు సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా..? అని ప్రశ్నించారు. మేం తీసేసినోళ్లను.. పనికి రానోళ్లను.. చంద్రబాబు తన దగ్గర చేర్చుకుంటున్నాడు అంటూ.. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను, నేతలను చేర్చుకోవడంపై సెటైర్లు వేశారు. ఇక, నేను 2009లో ఫారెస్ట్ మంత్రిగా పనిచేశాను.. ఎర్రచందనం అక్రమ తరలింపు కట్టడికి నేనే మొదటగా చర్యలు తీసుకున్నాను అని గుర్తుచేసుకున్నారు.. ఎవరి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎక్కువగా జరిగిందో అందరికీ తెలుసు.. చంద్రబాబు హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్ వద్ద క్వాలిటీ లీడర్ షిప్ ఉంది.. చంద్రబాబు ఏ రకంగానూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ధీటుగా లేడు అని వ్యాఖ్యానించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Read Also: Vishnu Kumar Raju: వైసీపీకి 17 సీట్లు కూడా రావు.. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉండాలి..!
