NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేశాడు.. కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలి..

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బీజేపీ నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారు.. జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తాను, రాష్ట్రాన్ని విడగొడతాను.. అని ఢిల్లీలో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారని దుయ్యబట్టారు.. హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఆరోపించిన ఆయన.. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి.. అలాంటి వ్యక్తి నేడు బీజేపీ నుండి రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు.. కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Read Also: Rohit Sharma-Dinesh Karthik: ప్రపంచకప్ కోసమే ఆడుతున్నావ్ కదా.. కార్తీక్‌ను టీజ్ చేసిన రోహిత్!