Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy: నా గురించి తప్పుగా మాట్లాడితే ప్రజలే ఓట్లతో సమాధానం ఇస్తారు

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధి నూకతోటి రాజేష్ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. టీడీపీపై హాట్‌ కామెంట్లు చేశారు.. రాత్రికి రాత్రి చంద్రబాబుతో కలిసి ఇక్కడ మనం గెలిపించిన వ్యక్తి మనపై పోటీ చేస్తున్నాడు.. చంద్రబాబు సత్యవేడు ను గెలిపించడం కాదు, ముందు కుప్పంలో గెలవాలి అని సవాల్‌ చేశారు.. నా పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే టీడీపీకి ఓట్లు పోతాయని హెచ్చరించారు. మేం వద్దు అనుకున్న అభ్యర్థిని నువ్వు టీడీపీ నుండి నిలబబెట్టావు.. టీడీపీకి అభ్యర్థులు లేక ఇక్కడ మనం వద్దనుకున్న వారిని పెట్టుకున్నారు అని దుయ్యబట్టారు.

Read Also: Nayattu Telugu: తెలుగులో రీమేక్ అయ్యాక డబ్బింగయి వస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్

సీఎం వైఎస్‌ జగన్ ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేశారు అని తెలిపారు పెద్దిరెడ్డి.. చంద్రబాబు 2014లో 100 పేజీల మేనిఫెస్టో, 600 హామీలు ఇచ్చారు.. ఒక్క హామీ అయినా చంద్రబాబు నెరవేర్చాడా ? అని నిలదీశారు. కొత్తగా సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు తిరుగుతున్నారు.. ఎవరు మాటపై నిలబడుతారో ప్రజలు గుర్తించాలని సూచించారు. చంద్రబాబు నా గురించి మాట్లాడిన మాటలకు సత్యవేడు ప్రజలు ఓట్ల రూపంలో సమాధానం ఇస్తారని హెచ్చరించారు. రాత్రికి రాత్రి పార్టీ మారిన వ్యక్తిని టీడీపీలో ఎవరు ఆదరిస్తారు? అని ప్రశ్నించారు. ఇన్ని సంవత్సరాలు వైసీపీ వారితో సేవలు చేయించుకుని టీడీపీకి వెళ్లావు.. కచ్చితంగా ఇక్కడ టీడీపీకి ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Exit mobile version