Nayattu Telugu: తెలుగులో రీమేక్ అయ్యాక డబ్బింగయి వస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayattu to release in Telugu as Chunduru Police Station: 2021లో లాక్ డౌన్ టైమ్ లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సూపర్ హిట్ మలయాళ చిత్రం ‘నాయాట్టు’ (వేట). కుంచాకో బోబన్, నిమిషా సజయన్, జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా మలయాళ ప్రేక్షకులనే కాదు భారతీయ ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకుంది. సింపుల్ కథకి, అద్భుతమైన కథనం, ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు వెరసి సినిమాను క్లాసిక్ గా నిలబెట్టాయి. ఓటు బ్యాంక్ రాజకీయాలతో నడిచే ప్రభుత్వం .. వ్యవస్థల్ని తమ స్వార్ధం కోసం ఎలా ఉపయోగించుకుంటుందో, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభుత్వం కోసం పనిచేసేవారు ఎలా బలిపశువులు అవుతారో ఈ సినిమాలో చూపించారు దర్శకుడు మార్టిన్ ప్రకాట్.
Kamal Haasan: కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం
Also Read
ఈ సినిమా రీమేక్ రైట్స్ ను విడుదలైన కొద్ది రోజులకే స్వంతం చేసుకుని తెరకెక్కించింది. జీఏ2 సంస్థ. తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. మలయాళం సూపర్ హిట్ నాయాట్టు రీమేక్ గా తెరకెక్కించగా గత ఏడాది నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒరిజినల్ సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేస్తున్నారు. ఆహా ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు చుండూరు పోలీస్ స్టేషన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ నెల 26 నుంచి ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?