చిత్తూరు జిల్లా పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు పై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి, మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో కి వచ్చినప్పుడు 14200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయి. నేడు వాటికి వడ్డీలకు వడ్డీలు అయ్యి 25 వేల కోట్లకు చేరిందని, సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై స్పందించారని ఆయన అన్నారు. అంతేకాకుండా.. చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే, ఏడాదికి రెండు లక్షల కోట్లు కావాలని, అసలు ఇది సాధ్యమేనా అని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దం అయ్యారని, చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు దొచుకున్నాయన్నారు.
Daggubati Purandeswari : బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టాం
సీఎం వైఎస్ జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని, మాట పైన సిఎం వైఎస్ జగన్ నిలబడుతారా?చంద్రబాబు నిలబడుతారా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. చంద్రబాబు ను నెత్తిన పెట్టుకుంటే మళ్ళీ రాష్ట్ర పదేళ్లు వెనక్కి పోతుందని, చంద్రబాబు అధికారంలో కి రాకముందు వాళ్ళ మామకు వెన్నుపోటు పొడిచారన్నారు. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రూ. 14,200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయని తెలిపారు. నేడు వాటికి వడ్డీలకు వడ్డీలు రూ.25వేల కోట్లు అయ్యిందన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెలవేర్చాలంటే రూ.2 లక్షల కోట్లు కావాలని ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారన్నారు.
China: నోట్ల వర్షం.. 3 సెకన్లలో రూ.120కోట్లు సంపాదిస్తున్న చైనా యువతి
