NTV Telugu Site icon

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు హామీలను నమ్మే పరిస్థితి లేదు.. ఆయన మేనిఫెస్టోపై ఎవరికి నమ్మకం లేదు..

Peddireddy

Peddireddy

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.. ఆయన మేనిఫెస్టో పై ఎవరికి నమ్మకం ఉండదు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై హాట్‌ కామెంట్లు చే శారు.. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోరు అని బీజేపీకి తెలుసన్న ఆయన.. అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికే నిరాకరించారు.. మేనిఫెస్టో అంటే విలువ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు.

Read Also: Margani Bharat Ram: కూటమి మేనిఫెస్టోను బీజేపీ కనీసం ముట్టుకోలేదు.. వైసీపీ సెటైర్లు

అయితే, మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించే గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు పెద్దిరెడ్డి.. ఇప్పుడే వారికి అధికారం వచ్చేసినట్టుగా నారా లోకేష్.. రాజధానిని నిర్మిస్తామని అంటున్నారు.. వారి ద్యాస అంతా ఇంకా భూములు దోచుకోవడంపైనే ఉంది అని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కు మరింత అండగా నిలవాలన్న ఆలోచన ఇప్పటికి వారికి లేదన్నారు. ఇక, చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.. ఆయన మేనిఫెస్టో పై ఎవరికి నమ్మకం ఉండదన్నారు. సీఎం వైఎస్‌ జగన్ ఎన్నికల హామీలు అన్ని అమలు చేశారని.. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పిన దమ్ము, ధైర్యం ఉన్న నేత సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.