Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా చేస్తున్న ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. మరోవైపు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్న ఆయన.. అక్కడ కూడా ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మోడీ ప్రచారానికి వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.. ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Trisha : విజయ్ లో ఆ ఒక్క విషయం నాకు నచ్చదు..
ఇక, నేను ఎవరికీ చిన్న ఇబ్బంది కలిగించలేదు.. నేను ఏ ఇబ్బంది పెట్టలేదని ప్రజలందరికీ తెలుసన్నారు పెద్దిరెడ్డి.. కావాలని రౌడీయిజం నాకు అంటగట్టి.. నాపై దుష్ప్రచారానికి తెలుగుదేశం పార్టీ పూనుకుంది అని మండిపడ్డారు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రౌడీయిజం చేసింది టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డే అన్నారు. ఆయన కారణంగా ఒక పోలీసు కన్ను కూడా కోల్పోయాడని విమర్శించారు.. ఇలాంటి వారికి మద్దతు ఇవ్వకూడదని ప్రజలను కోరుతున్నా.. రానున్న రోజుల్లో పుంగనూరికి మరిన్ని పరిశ్రమలు తెస్తాం అని హామీ ఇచ్చారు మంత్రి, వైసీపీ పుంగనూరు అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.