Peddi: జూన్’కి ‘పెద్ది’ వాయిదా.. టీం అధికారిక ప్రకటన.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. ఇప్పటివరకు విడుదలైన ఈ గ్లింప్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమా విడుదల తేదీపై చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ రిలీజ్ కొంచెం ఆలస్యం కానుంది. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే షూట్ కొంత మిగిలి ఉన్నట్టు గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతుంది ఈ క్రమంలోనే వాయిదా పడవచ్చని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా అధికారికంగా సినిమా టీం తెలిపిన వివరాల ప్రకారం.. సినిమాలోని ‘టాకీ’ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. కేవలం ఒకే ఒక్క సాంగ్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఎడిటింగ్ పనులు కూడా ఒక కొలిక్కి రావడంతో, సినిమా అవుట్‌పుట్ చూసిన మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట.
Varun Tej: వరుణ్ తేజ్ మోకాలికి సర్జరీ.. నిహారిక కీలక ప్రకటన.!
Also Read
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
- Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
అయితే, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం కేటాయించాలని టీమ్ నిర్ణయించుకుంది. టెక్నీషియన్లు తమ పనితనాన్ని మరింత మెరుగుపరిచి, సినిమాను పర్ఫెక్ట్‌గా తీసుకురావాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ముందుగా ప్లాన్ చేసిన దాని (ఏప్రిల్ 30) కంటే కాస్త ఆలస్యంగా, అంటే జూన్ నెలలో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కచ్చితమైన తేదీని త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ ఒక నోట్‌లో పేర్కొన్నారు. “మాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన కంటెంట్‌తో వస్తాం” అని టీమ్ పెద్ది పేర్కొంది.
Anudeep Katikala Arrest: పవన్ పై అనుచిత కామెడీ.. స్టాండప్ కమెడియన్ అరెస్ట్.?
.
తాజావార్తలు
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?