Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Peddakurapadu Mla Namburu Shankar Rao Election Campaign

Namburu Sankara Rao: ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చూపిస్తాం..

Published Date :April 24, 2024 , 1:10 pm
By Mahesh Jakki
Namburu Sankara Rao: ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చూపిస్తాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Namburu Sankara Rao: ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తనను ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాశిపాడులో ప్రతి ఇంటికి సంక్షేమం అందడంతో పాటు.. అభివృద్ధి కూడా జరగడంతో గ్రామస్థులు సంతోషంగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. బాణా సంచా పేలుస్తూ.. పూలతో తమ అభిమానాన్ని చూపించారు. వందలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు ఎమ్మెల్యేకు తమ మద్దతు తెలిపారు. మళ్లీ జగన్ సీఎం కావాలని.. ఎమ్మెల్యేగా శంకరరావు మల్లీ గెలవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో ప్రతి గ్రామంలో సచివాలయం, సీసీ రోడ్లు నిర్మించామన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలు బాగు చేశామన్నారు. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత మంచినీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పనులు చేపడుతున్నామన్నారు. నిన్నటివరకు వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామని చెబుతున్నారన్నారు. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే.. జన్మభూమి కమిటీల అరాచకాలు మళ్లీ మొదలవుతాయని.. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీఎంగా ఐదేళ్లలో రాజధానిలో ఒక్క కంపెనీ తీసుకురాని చంద్రబాబు.. ఇప్పుడు పెదకూరపాడులో ఐటీ కంపెనీ తెస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన టీడీపిని ప్రజలే నిలదీయాలన్నారు. సీఎం జగన్ పాలనలో గత ఐదేళ్లలో అందిన సంక్షేమం, జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. తమకు మంచి జరిగిందని భావిస్తే.. మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Read Also: Tirumala: హాట్‌ కేకుల్లా శ్రీవారి దర్శన టికెట్లు.. విడుదల చేసిన కాసేపట్లోనే..

వైఎస్సార్సీపీ వస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుంది: నంబూరు శంకరరావు
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు సరైన న్యాయం సాధ్యమని పెదకూరపాడు ఆయన అన్నారు. పెదకూరపాడు మండలం తమ్మవరంలో కూడా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ పేదల పార్టీ అని.. సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయితేనే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. 2019లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారన్నారు. ఇచ్చిన మాట తప్పకుండా మడమ తిప్పకుండా కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు అందించారన్నారు. అన్నదాతలకు భరోసా ఇచ్చారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు. పాఠశాలలు బాగు చేసి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారన్నారు. తాను కూడా 2019 ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానన్నారు. అమరావతి – బెల్లంకొండ రోడ్డు, అమరావతి – తుళ్లూరు రోడ్డు, పెదమద్దూరు బ్రిడ్జి పూర్తి చేస్తున్నామన్నారు.

ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆర్ధికంగా బలపడడానికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ఇస్తుంటే సోమరిపోతులను చేస్తున్నారని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నారన్నారు. ఒకప్పుడు వాలంటీర్లను దొంగలతో పోల్చిన చంద్రబాబు.. ఇప్పుడు వారికి జీతాలు పెంచుతామంటున్నారన్నారు. సీఎం జగన్ బాటలో నడుస్తూనే చంద్రబాబు.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి.. మంచి చేసిన వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని.. మరోసారి అవకాశమిస్తే రాష్ట్రానికి రోల్ మోడల్‌గా మార్చి మీ చేతుల్లో పెడతానని చెప్పారు. తాను చేసిన మంచిని చూసి తనకు అండగా నిలవాలని కోరారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. మళ్లీ జన్మభూమి కమిటీల అరాచకాలు మొదలవుతాయన్నారు. సంక్షేమ పాలన కావాలంటే ఒక ఓటు తనకు, మరో ఓటు ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • latest news
  • Namburu Sankara Rao
  • Peddakurapadu MLA

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions