NTV Telugu Site icon

Namburu Sankara Rao: భారీ జనసంద్రంతో నామినేషన్ దాఖలు చేసిన నంబూరు శంకరరావు..

Namburi

Namburi

భారీగా తరలి వచ్చిన అశేష జనవాహనితో పెదకూరపాడు జనసంద్రంగా మారింది. పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకరరావు నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నిర్వహించిన ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించింది. మొదట తుళ్లూరు మండలం పెదపరిమిలోని స్వగృహంలో సతీమణి శ్రీమతి నంబూరు వసంతకుమారితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన శంకరరావు.. అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయల్దేరారు. అమరావతి మండలం 14వ మైలు, ఎండ్రాయి, నరుకుళ్లపాడు, అమరావతి, 75 తాళ్లూరు మీదుగా పెదకూరపాడు చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు.

Read Also: Khammam Crime: టీ కోసం పెళ్లి ఇంట ఘర్షణ.. బీరు సీసాలు, కర్రలతో దాడి.. చివర్లో ఊహించని ట్విస్ట్..!

ఆ తర్వాత పెదకూరపాడు నాలుగు రోడ్ల జంక్షన్ లో కార్యకర్తలను ఉద్దేశించి నంబూరి శంకరరావు మాట్లాడుతూ.. తనను నమ్మి మొదటి సారి పెదకూరపాడులో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకండా గత ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాను అని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి చూసి.. రోడ్లు పూర్తి చేశాకే ఎన్నికలకు వస్తానని చెప్పాను.. అది అమలు చేశాకే ఇప్పుడు మళ్లీ ఓటు అడుగుతున్నానన్నారు. అమరావతి – బెల్లంకొండ రోడ్డు దాదాపు పూర్తి కావడానికి సిద్ధంగా ఉందన్నారు. దీంతో పాటు ప్రతి గ్రామానికి లింకు రోడ్లు బాగు చేశామన్నారు. నియోజకవర్గంలో ప్రతి రోడ్డు పూర్తి చేశానని చెప్పేందుకు గర్వ పడుతున్నానన్నారు. ప్రజలకు సౌకర్యాల కోసం గ్రామ గ్రామాన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు నిర్మించామని ఎమ్మెల్యే నంబూరి శంకరరావు అన్నారు.

Read Also: Peddapalli: కూలిన మానేరు నదిపై నిర్మాణంలో వున్న వంతెన.. తప్పిన ప్రమాదం..

ఇక, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని పెదకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకరరావు అన్నారు. నియోజకవర్గంలో నాడు- నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. పేదలక నాణ్యమైన వైద్యం అందాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలో ప్రభుత్వాస్పత్రులు బాగు చేశామన్నారు. మనం చేసిన దాంట్లో కనీసం నాలుగో వంతు అయినా టీడీపీ ప్రభుత్వం చేసిందాని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేయడం తప్ప.. చంద్రబాబుకు ఏం తెలుసు అన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్టు చదివి.. తనపై నిరాధార ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. గత ఐదేళ్లలో జగనన్న పాలనలో, తాను చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తించి.. ప్రజలు తనకు మరోసారి అండగా నిలవాలని నంబూరి శంకరరావు కోరారు.

Read Also: Deadpool Wolverine: పిచ్చెక్కించే విజువల్స్ తో ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ ట్రైలర్

కాగా, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ.. నంబూరు శంకరరావు నామినేషన్ కూడా విజయోత్సవంలా ఉంది అన్నారు. రాబోయే ఎన్నికల్లో నంబూరు శంకరరావు గెలుపు ఖాయమన్నారు. ప్రజాభిమానం చూస్తేంటే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కేలా లేవన్నారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన జగనన్న.. శంకరన్నకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.