NTV Telugu Site icon

Revanth Reddy: తెలంగాణ డీజీపీకి పీసీసీ చీఫ్ రేవంత్ ఫోన్.. వెహికిల్స్ నిలిపివేతపై సీరియస్

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఇవాళ ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు వచ్చే వెహికిల్స్ ను పోలీసులు అడ్డుకోవడంపై రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడారు. సుమారు 1700 వాహనాలను సీజ్ చేశారని ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం సభకు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని రేవంత్ రెడ్డి డీజీపీ అంజనీ కుమార్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ పద్దతి సరైంది కాదన్నారు. పరిస్థితి చేయి దాటితే అందుకు పోలీస్ శాఖే బాధ్యత వహించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి డీజీపీకి వార్నింగ్ ఇచ్చారు.

Read Also: Assam: అస్సాంలో రూ.11కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత.. ముగ్గురు స్మగ్లర్లు అరెస్ట్

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇవాళ ఖమ్మంలో ముగియనుంది. ఈ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని జన గర్జన పేరుతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. ఈ సభ ద్వారానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందనే విషయంపై ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలియజేయనుంది.

Read Also: TS BJP: రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ను పరిశీలించిన కిషన్ రెడ్డి, బండి సంజయ్

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. కర్ణాటకలో అధికారంలోకి రావడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో జోష్ వచ్చింది. కర్ణాటక ఫార్మూలాతోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం నేతలు తమ మధ్య ఉన్న సమస్యలను పక్కన పెట్టాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం సూచించడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జోష్ వచ్చింది.