Site icon NTV Telugu

PCC chief Mahesh Goud: ధరణి పోర్టల్‌లోని లోపాలు సవరిస్తాం..

Maheshkumar

Maheshkumar

ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. సమస్యల పుట్ట ధరణి పోర్టల్ అని.. మాజీ సీఎం కేసీఆర్ సదుద్దేశ్యంతో తీసుకువచ్చారని అనుకున్నామన్నారు. కానీ ఊరు పేరు లేని సంస్థకు ధరణిని అప్పగించారని చెప్పారు. రైతులకు అనేక ఇబ్బందులు కలిగాయని తెలిపారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్, హరీష్ రావుకి లోపాయికారీ ఒప్పందంగా ఉన్నాయని.. దీంతో భూములు కొల్లగొట్టారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్న ఎన్‌ఐసీకి ధరణిని కేటాయించడం జరిగిందని.. అందులోని లోపాలు సవరిస్తామని స్పష్టం చేశారు.

READ NORE: Tuition Teacher: 9 ఏళ్ల బాలికను చెంపపై కొట్టిన టీచర్.. టెటానస్ ఇన్ఫెక్షన్‌తో ప్రాణాపాయ స్థితి..

జీవన్ రెడ్డి వ్యాఖ్యాలపై మహేష్ గౌడ్ స్పందించారు. ఆయన ఏ విమర్శలు చేసిన ఆయన వ్యక్తిగతమన్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు గంగారెడ్డి హత్య చాలా దురదృష్టకరమని.. అందరితో చర్చించి, అన్ని అలోచించి చేరికలు చేసుకున్నామని చెప్పారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఏ కార్యకర్తను చేజార్చుకోమని పునరుద్ఘాటించారు. దానికి మేకానిజం సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సీఎం, తాను చాలా జాగ్రత్తగా ఇందులో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని.. అక్కడక్కడ సీనియర్ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఏ ఇబ్బంది లేదని.. హత్య రాజకీయాలకు తెలంగాణలో స్థానం లేదన్నారు. ఏ పార్టీ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని సూచించారు.. బీజేపీ నేతలు మాట్లాడే దానికి అర్థం ఉండాలని.. మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిదికాదన్నారు. ప్రతి అంశంతో ఓట్లు దండుకోవాలనుకోవడం అవివేకమని విమర్శించారు. వామపక్ష భావజాలంతో ఉండి.. బీజేపీకి వెళ్ళింది ఈటెల రాజేందర్ కదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎంతమేర నెరవేర్చారు అని ఈటెల మోడీని అడగాలన్నారు.
మూసీ ప్రక్షాళన చేయాలా వద్దా.? అని ప్రశ్నించారు. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలనేది కాంగ్రెస్ ధ్యేయమని మరోసారి స్పష్టం చేశారు.

Exit mobile version