పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై.. ఏడాది తమ పాలనపై చర్చకు తాము సిద్ధమని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఫార్మా సిటీ ఒక్క చోట ఉండొద్దు అనే.. వికేంద్రీకరణ చేశామన్నారు. కేటీఆర్ తప్పు చేశా అని ఫీల్ ఐతున్నాడు.. కాబట్టి జైలుకు పోతా అంటున్నాడన్నారు. “మేం విచారణ జరపకుండా నే.. జైలుకు పోతా అంటున్నాడు. కొన్ని నియోజక వర్గాల్లో సమస్యలు ఉన్నాయి.. వాటిపై త్వరలోనే చర్యలు జరుపుతాం. పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ లో ఉన్న మాట వాస్తవం. మాది కార్యకర్తల పార్టీ.. వాళ్లకు పదవులు ఇవ్వాల్సి ఉంది.. కాస్త ఆలస్యం అయ్యింది. బీఆర్‌ఎస్ హయంలో అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయి. కాస్త సమయం పడుతుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ .. ప్రభుత్వం మధ్య సమన్వయం తోనే నడుస్తుందని మరోసారి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాం.. కాబట్టి సోషల్ మీడియా కొంత యాక్టివ్ గా లేదు. కానీ బీఆర్‌ఎస్ వాళ్ల మాదిరిగా మేము దిగజారి రాజకీయాలు చేయలేము. కేటీఆర్ బుర్ర తక్కువోడు. కాళేశ్వరం కింద కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టడం ఎంటి..? కేటీఆర్ వ్యవహారం.. పిచ్చి మహారాజు సినిమా లెక్క ఉంది” అని ఆయన బీఆర్‌ఎస్ ను విమర్శించారు.