NTV Telugu Site icon

T20 WC 2024: పాకిస్థాన్ న్యూ జెర్సీ విడుదల.. ఫోటోలు వైరల్.. !

Pak

Pak

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టు న్యూ జెర్సీని రివీల్ చేసింది. మ్యాట్రిక్స్ జెర్సీ’ 24 పేరుతో పీసీబీ బోర్డ్ త‌మ కొత్త జెర్సీని సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుదల చేసింది. కెప్టెన్ బాబ‌ర్ ఆజం, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా లాంటి స్టార్ ప్లేయ‌ర్స్ కొత్త జెర్సీని ధ‌రించి ఉన్న ఫోటోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షేర్ చేసింది. ఈ జెర్సీని పాకిస్తాన్ ఫ్యాన్స్ పీసీబీ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొనింది. ఇక పాక్ న్యూ జెర్సీ.. వారి సాంప్రదాయ ఆకు పచ్చ రంగులో ఉండగా.. ఈ మెగా టోర్నమెంట్‌కు చెందిన లోగో.. జెర్సీ రైట్ సైడ్ ఉండగా.. పీసీబీ లోగో ఎడమ వైపు ఉంది. అయితే, పాక్ జట్టు కొత్త జెర్సీలో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫన్సీ కామెంట్స్ పెడుతున్నారు.

Read Also: subramanya swamy: కేంద్ర క్యాబినెట్ పై బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి కీలక వ్యాఖ్యలు

ఇక, ఈ మెగా టోర్నమెంట్ లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6వ తేదీన అమెరికాతో తలపడబోతుంది. అయితే, ఈ పొట్టి ప్రపంచ‌ క‌ప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా త‌మ జ‌ట్టును ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత త‌మ టీమ్ ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. ఇక, ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం టీమిండియా జట్టుతో పాటు కొత్త జెర్సీని విడుదల చేసింది.