NTV Telugu Site icon

Payyavula Keshav: జగన్ సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటాం..

Payyavula 2

Payyavula 2

Payyavula Keshav: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సభకు రావాలని.. సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ రోజు శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు.. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో బాధ్యతలను స్వీకరించిన పయ్యావుల.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.. ఇక, మీడియా చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.. ప్రజల కోసం.. ప్రజల సంక్షేమం కోసం సభ అనే విధంగా అసెంబ్లీ సమావేశాలు నడుపుతాం అన్నారు.. వైఎస్‌ జగన్ సభకు రావాలని.. ప్రజా సమస్యలపై మాట్లాడాలనే తాము కోరుకుంటామని తెలిపారు.. ఇక, స్వపక్షమైనా.. విపక్షమైనా మేమే.. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా మేం సిద్దంగా ఉంటామని వెల్లడించారు మంత్రి పయ్యావుల కేశవ్‌.

Read Also:Kaushik Reddy: మీ డిమాండ్ లు మీకు తెలియదా?.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై పాడి కౌశిక్‌ రెడ్డి ఫైర్‌

మొదట శాసనసభ ప్రాంగణంలో ఉన్న టీడీఎల్పీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన పయ్యావుల కేశవ్‌.. ఆ తర్వాత శాసన సభ కార్యాలయంలో శాసన సభ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రజలకు జవాబుదారీ తనంతో కూడిన పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు.. మరోవైపు.. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రి పయ్యావులకు వివరించారు సెక్రటరీ కేవీవీ సత్యనారాయణ. సీఎం చంద్రబాబుతో చర్చించి త్వరలో శ్వేత పత్రం విడుదల చేయాల్సి ఉంటుందన్నారు.. అన్ని రకాల అప్పులు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఓ నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి పయ్యావుల కేశవ్.