NTV Telugu Site icon

Layoff in paypal : నేడు పే పాల్ వంతు.. ఊడిపోయిన 2000ఉద్యోగాలు

Paypal 19

Paypal 19

Layoff in paypal : ఆర్థిక మాంద్యం భయంతో టెక్ కంపెనీలన్నీ ఖర్చు తగ్గింపు చర్యలను చేపడుతున్నాయి. ఈ క్రమంలో భారీగా ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలే తమ సంస్థలోని వేలాది మందిని ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపించివేశాయి. తాజాగా.. వీరి అడుగుల్లోనే నగదు లావాదేవీలు, చెల్లింపులు జరిపే ఒక అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ పేపాల్ కంపెనీ 2వేలమంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది.

Read Also: Venky Atluri: డైరెక్టర్ ‘సార్’ పెళ్లి అయిపొయింది…

పేపాల్ హోల్డింగ్స్ ఇంక్ త్రైమాసికంలో స్థూల ఆర్థిక మందగమనం కారణంగా రెండు వేల మందిని జాబ్ నుంచి తీసేస్తున్నట్లు బుధవారం పేపాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపు సంస్థలో7 శాతం మంది ఉద్యోగులపై ఉంటుందని తెలిపారు. కొన్ని వారాల్లో ఈ ప్రక్రియ అమలు అమలవుతుందని దీనికి సంబంధించి ఉద్యోగులకు మెమో పంపించామని తెలిపారు. ఈ కష్టాన్ని గట్టెక్కటానికి ఉన్న ఉద్యోగులతో పాటు తాము కూడా ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. పేమెంట్ గేట్ వే కంపెనీ అయిన పేపాల్ స్టాక్ దెబ్బతింది.

Read Also: Union Budget 2023: ఎన్నికల వేళ.. కర్ణాటకకు భారీ నజరానా