NTV Telugu Site icon

Byju’s: రూ.9 వేల కోట్లు చెల్లించండి.. బైజూస్‌కు ఈడీ నోటీసులు

Byjus

Byjus

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విదేశీ నిధుల చట్టాలు (ఫెమా) ఉల్లంఘించినందుకు రూ.9000 కోట్లు చెల్లించాల్సిందిగా ఆ సంస్థకు ఈడీ నోటీసులిచ్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. అయితే ఈ వార్తలను బైజూస్‌ ఖండించింది. ఈడీ నుండి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు.

Read Also: Suryakumar Yadav: విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం రికార్డులపై స్టార్ ఆటగాడు కన్ను..!

2011 నుండి 2023 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) రూపంలో రూ.28 వేల కోట్లు బైజూస్‌ అందుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇదే కాలంలో విదేశీ పెట్టుబడుల రూపంలో ఇతర దేశాలకు రూ.9,754 కోట్లను బైజూస్‌ తరలించినట్లు పేర్కొన్నాయి. అంతేకాకుండా.. విదేశీ అధికార పరిధికి పంపిన మొత్తంతో సహా ప్రకటనలు, మార్కెటింగ్ ఖర్చుల కోసం బైజూస్ సుమారు రూ. 944 కోట్లను బుక్ చేసిందని ఈడీ తెలిపింది. దీంతో ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద నోటీసులిచ్చినట్లు వెల్లడించాయి.

Read Also: Israel-Hamas War: బందీల విడుదలపై చర్చలు చివరి దశకు చేరుకున్నాయి.. ఖతార్ వెల్లడి..

బైజూస్ మాతృసంస్థ ‘థింక్ అండ్ లెర్న్ ప్రైవేటు లిమిటెడ్’ని బైజూ రవీంద్రన్, ఆయన భార్య దివ్య గోకుల్‌నాథ్ 2011లో స్థాపించారు. ఆరంభంలో పోటీ పరీక్షల కోసం ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్‌ను అందించారు. ఆ తర్వాత 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో కంపెనీ అనూహ్యమైన రీతిలో వృద్ధి చెందింది. చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు బైజూస్ అందుబాటులోకి రావడంతో 2018 నాటికిఏకంగా 1.5 కోట్ల కుటుంబాలకు చేరువైంది. కరోనా సమయంలో మరింత పాపులర్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత 2021లో భారీ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో బైజూస్‌కి ఆదరణ కరువైంది.

Show comments