పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు దర్శకనటుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితర సీనియర్ నేతలు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు..
తమిళ్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం`వినోదయ సీతమ్`కు రీమేక్ ఇది. ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్ర లో కనిపించగా.. సాయి ధరమ్ తేజ్ మార్క్ అనే యువకుడి పాత్రలో నటించాడు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బ్రో సినిమా జూలై 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇకపోతే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ స్పెషల్ సాంగ్ ను మొదట రకుల్ ప్రీత్ సింగ్ తో చేయించాలని అనుకున్నారు.
కానీ, ఆఖరి నిమిషంలో డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఎంపిక చేశారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఈ స్పెషల్ సాంగ్ కోసం భారీ ఖర్చుతో ఓ పబ్ సెట్ వేశారు. ప్రస్తుతం అక్కడే బ్రో ఐటెం సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఊర్వశి రౌతేలా కూడా ఈ సాంగ్ షూట్ లో పాల్గొంది.. అయితే ఈ సాంగ్ కోసం అమ్మడు భారీగా డిమాండ్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్క పాటకు ఈమె ఏకంగా రూ.2 కోట్లు అందుకుంటుందని సమాచారం.. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.. ఒక్క పాటకు అంతనా చిన్న సినిమాలను రెండు తీయొచ్చు అని సినీ జనాలు అంటున్నారు.. ఆ మాటకు వస్తే హీరోలకు ఎంత ఉంటుందో అని జనాలు ఆలోచిస్తున్నారు..