Pawan Kalyan : ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెన్సార్ టాక్.. హిట్టా.. ఫట్టా?

Ustad Bhagath Singh

Ustad Bhagath Singh

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మాస్ డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్.. గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Also Read : Mega Star : విశ్వంభర డబుల్ షాక్.. 400 కోట్లా?

ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్. అందుకే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొనడం లేదు. కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఈవెంట్‌ను మార్చి 15న ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో.. ఉస్తాద్ సెన్సార్ కార్యక్రమాల పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.  ఫస్టాఫ్ 1గంట 11 నిముషాల 30 సెకండ్స్, సెకండాఫ్ 1 గంట  22నిమిషాల29 సెకండ్స్ తో కలిపి మొత్తం రన్ టైం వచ్చేసి 2 గంటల 34 నిమిషాలు లాక్ అయింది. ఓ సినిమాకు ఇది పర్ఫెక్ట్ రన్ టైం అనే చెప్పాలి. సినిమా చూసిన సెన్సార్ టీమ్ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పినట్టు సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం పనిచేస్తుండడం విశేషం.