NTV Telugu Site icon

Hari Hara Veera Mallu: ‘పవర్ స్టార్’ అభిమానులకు శుభవార్త.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Hari Hara Veera Mallu Release

Hari Hara Veera Mallu Release

Hari Hara Veera Mallu Release Date Out: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పార్ట్ 1ను 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ‘మెగా సూర్య ప్రొడక్షన్’ ఎక్స్‌లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈరోజు షూటింగ్ కూడా ఆరంభం అయిందని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన పవర్ స్టార్ ఫాన్స్ ఆనందానికి అవద్దులేకుండా పోయాయి.

‘2025 మార్చి 28న అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షూట్‌లో జాయిన్ అయ్యారు. హరిహర వీరమల్లు షూటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో వేసిన సెట్‌లో తిరిగి ప్రారంభమైంది’ అని మెగా సూర్య ప్రొడక్షన్ తన ఎక్స్‌లో పేర్కొంది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ హరి హర వీరమల్లు. ముందుగా ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు జ్యోతికృష్ణ బాధ్యతలు అందుకున్నారు.

Also Read: Chess Olympiad 2024: ఈరోజు భారత చెస్ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం చంద్రబాబు

హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకుంది. ఏడాదిగా పవన్‌ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో.. మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. పవన్‌ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్‌ మాత్రమే మిగిలి ఉంది. దీంతో తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తీరిక లేకుండా ఉన్నా.. సినిమా షూటింగ్‌ కోసం సమయాన్ని కేటాయించారు. విజయవాడలో నేడు హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది.

 

Show comments