Hari Hara Veera Mallu: ‘పవర్ స్టార్’ అభిమానులకు శుభవార్త.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hari Hara Veera Mallu Release Date Out: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పార్ట్ 1ను 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ‘మెగా సూర్య ప్రొడక్షన్’ ఎక్స్‌లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈరోజు షూటింగ్ కూడా ఆరంభం అయిందని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన పవర్ స్టార్ ఫాన్స్ ఆనందానికి అవద్దులేకుండా పోయాయి.
‘2025 మార్చి 28న అన్‌స్టాపబుల్ ఫోర్స్, అన్‌బ్రేకబుల్ స్పిరిట్ హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షూట్‌లో జాయిన్ అయ్యారు. హరిహర వీరమల్లు షూటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో వేసిన సెట్‌లో తిరిగి ప్రారంభమైంది’ అని మెగా సూర్య ప్రొడక్షన్ తన ఎక్స్‌లో పేర్కొంది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరి హర వీరమల్లు. ముందుగా ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు జ్యోతికృష్ణ బాధ్యతలు అందుకున్నారు.
Also Read
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
Also Read: Chess Olympiad 2024: ఈరోజు భారత చెస్ చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం చంద్రబాబు
హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకుంది. ఏడాదిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో.. మిగిలిన చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ పాత్రకు సంబంధించి 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో తన సన్నివేశాలను పూర్తి చేసేందుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తీరిక లేకుండా ఉన్నా.. సినిమా షూటింగ్ కోసం సమయాన్ని కేటాయించారు. విజయవాడలో నేడు హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో విడుదల కానుంది.
తాజావార్తలు
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!