Site icon NTV Telugu

SVC : దిల్ రాజు.. పవన్ కళ్యాణ్.. వంశీ పైడిపల్లి సినిమా ఫిక్స్..

Dil Raju Vamsi Paipally

Dil Raju Vamsi Paipally

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. అటు పవర్ స్టార్ కూడా OG ఇచ్చిన జోష్ తో మరికొన్ని సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే నలుగురు నిర్మాతలు అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు. వీరిలో ప్రస్తుతం టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజుతో సినిమా చేసేందుకు పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో వీరి కాంబోలో వకీల్ సాబ్ వచ్చిన సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి పవర్ స్టార్ – దిల్ రాజు కాంబోలో సినిమా వస్తుంది.

Also Read : Flop Heroine : ఆ ప్లాప్ హీరోయిన్ మళ్లీ వస్తోంది.. ఈ సారైనా హిట్ వస్తుందా?

ఇటీవల ఓ రెండు కథలను పవర్ స్టార్ కు వినిపించారు దిల్ రాజు. అందులో టాలీవుడ్ బడా దర్శకులలో ఒకరైన వంశి పైడిపల్లి కూడా ఓ కథను వినిపించాడు. వంశి చెప్పిన పాయింట్ పవర్ స్టార్ కు విపరీతంగా నచ్చింది. పవన్ నెక్ట్స్ సినిమా వంశి పైడిపల్లితోనే ఫిక్స్ అయింది. ప్రస్తుతం హరీష్ శంకర్ డిరెక్టన్ లో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్. వాస్తవంగా వంశీ పైడిపల్లి రెడీ చేసిన కథను మొదట బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు వినిపించారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు కూడా వినిపించింది. కానీ కారణాలు తెలియవు కానీ ఆస్క్రిప్ట్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వద్దకు చేరడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడ కూడా జరిగింది.

Exit mobile version