Site icon NTV Telugu

Anna Konidela: తిరుమల చేరుకున్న అనా కొణిదెల.. డిక్లరేషన్ సమర్పణ

Anna

Anna

Anna Konidela: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సోమవారం దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం ఆమె రేణిగుంట విమానాశ్రయం ద్వారా తిరుపతి చేరుకున్నారు. శ్రీమతి అనా కొణిదల రేపు (సోమవారం) వేకువజామున తిరుమలలో జరిగే సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. అనంతరం ఆమె స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇటీవ‌ల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో, ఈ విషయంలో భగవంతుడికి కృతజ్ఞతగా స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించనున్నారు. ఈ సందర్భంగా ఆమెకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తిరుమల చేరుకున్న ఆమె డిక్లరేషన్ సమర్పించారు. టీటీడీ నిభందనల మేరకు తిరుమల చేరుకోగానే అతిది గృహంలో డిక్లరేషన్ సమర్పించారుఅనా కొణిదెల.

Exit mobile version