Pawan Kalyan Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఎన్నికల ముందు ఆయన సైన్ చేసిన మూడు సినిమాలు షూటింగ్ మధ్యలో ఆగిపోయాయి. ఈ మూడు సినిమాలలో భారీ పాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నారు. ఈ సినిమాను మొదటగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా కొన్ని కారణాల వల్ల ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ ను నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ చేపట్టాడు.
IND vs BAN: భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగిన కీలక ఒప్పందాలు ఇవే…
అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మళ్లీ మొదలవుతుందో మాత్రం అర్థం అవ్వట్లేదు. తాజాగా ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం సినిమా షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్ జూలై మొదటి వారంలో జాయిన్ అవుతారని అనేక వార్తలు వస్తున్న అందులో ఎలాంటి నిజం లేదని ఆయన కన్ఫామ్ చేశారు.
Health: వర్షాకాలంలో జ్వరం, జలుబు రాకుండా ఉండేందుకు ఇవి తీసుకోండి..!
పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. కాకపోతే., ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ నుంచి కాస్త సమయం దొరికిన తర్వాతనే షూటింగ్లో పాల్గొంటారని నిర్మాత ఏయం రత్నం క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించాల్సిన భాగం చాలా తక్కువ రోజులు మాత్రమే ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా షూటింగ్ మొదలవడం ఇప్పట్లో కనబడేలా లేదు.