Site icon NTV Telugu

Pawan Kalyan: నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసల వర్షం..

Pawan Nitish

Pawan Nitish

తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మీరు ‘భారత్‌’ లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారన్నది కాదు.. దేశం గర్వించేలా ఏం చేశారన్నది ముఖ్యం. ప్రియమైన ‘నితీష్ కుమార్ రెడ్డి,’ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత్‌ నుంచి అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించినందుకు.. ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) యొక్క కీలకమైన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో 114 పరుగులతో అద్భుతమైన నాక్‌తో మీ ప్రతిభను ప్రదర్శించారు.’ అని పవన్ కల్యాణ్ తెలిపారు. ‘మరెన్నో ప్రపంచ స్థాయి రికార్డులను సాధించడం కొనసాగించండి, భారత్ జెండాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లండి. యువతకు క్రీడల పట్ల అభిరుచి మరియు దృఢ సంకల్పంతో ఆసక్తిని పెంపొందించేలా స్ఫూర్తినివ్వండి. ఈ సిరీస్‌లో భారత్‌ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.’ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Vijay Antony: నన్ను క్షమించండి.. విచారం వ్యక్తం చేస్తూ విజయ్ ఆంటోని కీలక ప్రకటన!

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య మెల్‌బోర్న్ లో నాల్గవ టెస్టు మ్యా్చ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. 8వ నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. దీంతో.. కష్టాల్లో ఉన్న జట్టును సెంచరీతో ఆదుకోవడంపై అటు క్రికెట్ అభిమానులు, లెజండరీ ఆటగాళ్లు, పలువురు నేతలు నితీష్ కుమార్ రెడ్డి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: RRB Group D Recruitment 2025: ఏకంగా 32,000 ఉద్యోగాలను విడుదల చేసిన రైల్వేబోర్డు..

Exit mobile version