Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెల్త్ కండిషన్‌పై డాక్టర్ల కీలక ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. శనివారం సాయంత్రం ఆయనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని వైద్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా వెన్నునొప్పి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు, వైద్యుల సూచన మేరకు ఈ ఆపరేషన్ నిర్వహించారు.
Also Read : Raaka: ‘రాకా’ రిలీజ్ పై సరికొత్త బజ్..
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్‌లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన అధికారిక పర్యటనలను రద్దు చేసుకుని ఆయన వెంటనే ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఎంఆర్ఐ (MRI), ఇతర పరీక్షలు నిర్వహించి, చిన్నపాటి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. శనివారం సాయంత్రం నిపుణులైన వైద్య బృందం ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసింది. శస్త్రచికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరో రెండు మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ కి ఆపరేషన్ జరిగిందని తెలియగానే సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!