Site icon NTV Telugu

Pawan Kalyan: ఆ వ్యాధితో నరకం అనుభవించిన పవన్ కళ్యాణ్.. ఎవరికీ తెలియని నిజం

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఈ పేరంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. కేవలం రెండు రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ ఉంది. ఆ పేరు వింటే చాలు ఓ రకమైన వైబ్రేషన్స్ ఒంట్లో మొదలవుతాయి. ఆ కటౌట్ అలాంటిది మరి. తన స్టైల్ అంటే మూడేళ్ల బుడ్డోడు మొదలుకుని మూలకున్న ముసలోడి వరకు ఫాలో అవ్వాల్సిందే. ఎందరో పవన్ మేనరిజాన్ని ఇమిటేట్ చేసి స్టార్స్ అయ్యారు. మరెందరికో అతనో రోల్ మోడల్. కెరీర్ మొదట్లో పవన్ కల్యాణ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదట. అయినా తన అన్న మెగాస్టార్ భార్య సురేఖ చొరవతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తొలి సినిమాతో ఫర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ తర్వాత వరుసగా అరడజన్ హిట్స్ కొట్టి స్టార్ స్టేటస్ అందుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో దట్ ఈజ్ పవన్ అనిపించుకున్నాడు.

Read Also:Thalapathy68: 23 ఏళ్ల తరువాత విజయ్ సరసన జ్యోతిక..

ప్రస్తుతం పవనిజం నడుస్తోంది. త‌నదైన స్టైల్‌, మ్యాన‌రిజ‌మ్స్ తో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. మరేస్టార్ కు దక్కని విధంగా తిరుగులేని ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి.. అన్నను మించిన తమ్ముడిగా ఎదిగాడు. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న వరుసగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్సును అలరిస్తున్నాడు. అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి చాలా మందికి తెలియని ఓ సీక్రెట్ ఉంది. ఓ సమయంలో ఆయన ఓ వ్యాధితో నరకయాతన అనుభవించాడట. ఏంటి మా పవన్ కు వ్యాధా.. అవును మీరు చదివింది నిజమే.. కాకపోతే విషయం ఇప్పటిది కాదు. పవన్ స్కూల్ డేస్ నాటిది.

Read Also:Geetha Madhuri: హాట్ లుక్ లో సింగర్ గీతా మాధురి.. హీరోయిన్ గా ఏమైనా ట్రై చేస్తున్నావా.. ?

తాను చ‌దువుకుంటున్న స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస్తమా బారిన ప‌డ్డారు. ఆ వ్యాధి వ‌ల్ల ఆయ‌న చాలా ఇబ్బంది పడ్డారట. ఆస్తమాతో తరచూ హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చేదట. దాంతో స్కూల్ కు సరిగా వెళ్లలేకపోయేవాడట. అంతేకాకుండా తనకు ఫ్రెండ్స్ ఉండేవారు కాదట. మ‌రోవైపు ప‌రీక్షల ఒత్తిడితో పవన్ డిప్రెషన్లోకి నెట్టేశాయట. ఆ డిప్రెష‌న్ లోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడట. కానీ, ఎలాగోలా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు. తన ఒంట‌రిత‌నాన్ని పోగొట్టుకోవడానికి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా ఏ విషయం అయినా సొంతంగా నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. కొద్ది రోజుల‌ ట్రీట్ మెంట్ తర్వాత ఆయన ఆస్తమాను జయించగలిగాడు. మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సాధించి.. నెమ్మదిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు.

Exit mobile version