NTV Telugu Site icon

Pawan Kalyan: జన్మనిచ్చిన తెలంగాణకు సేవ చేయాలనే వచ్చా..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ, జనసేన అభ్యర్థులకు మద్దతుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జై తెలంగాణ అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జిల్లాలోని బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన తెలంగాణలో ధర్మ యుద్ధం చేద్దామని పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. నిధులు, నియామకాలు, నీళ్లపై తెలంగాణ ఉద్యమం జరిగిందని.. ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బంది పడ్డ నల్గొండ జిల్లానే జనసేన పార్టీ ఆవిర్భావానికి స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలన్నారు.

Also Read: Harish Rao: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు ఫైర్

మోడీ నాయకత్వంలో దేశంలో అందరికి సమానత్వం నినాదంతో పాలన సాగుతుందన్నారు. జనసేన మనస్ఫూర్తిగా బీజేపీకి మద్దతిస్తుందని పవన్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో అడపడుచుల ఆదృశ్యం ఎక్కువైంది, మహిళలపై ఆగడాలు ఎక్కువయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బండెనక బండి కట్టి అని గజ్జెకట్టి పాడిన గద్దర్ స్పూర్తితో సమానత్వ సమాజం కోసం పాటుపడదామన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. ఆ దిశగా జనసేన కృషి చేస్తోందన్నారు. తెలంగాణ యువత పోరాట స్పూర్తితో ఆంధ్రాలో పోరాటం చేస్తున్నామన్నారు. జన్మనిచ్చిన తెలంగాణాకు సేవ చేయాలనే వచ్చానన్నారు. మనస్ఫూర్తిగా ఘన స్వాగతం పలికింది మద్దతుదారులంతా బీజేపీ ఆభ్యర్ధుల గెలుపు కోసం పాటుపడాలని ఆయన సూచించారు.

 

మోడీ నాయకత్వంలో సమానత్వంతో దేశం ముందుకుపోతుంది | Pawan Kalyan | Ntv