Pawan Kalyan: పదవి చిన్నదా..పెద్దదా కాదు బాధ్యతే గొప్పది.. జనసేన నేతలతో డిప్యూటీ సీఎం
- అమరావతిలో జనసేన పార్టీ పదవి–బాధ్యత కార్యక్రమం నిర్వహణ
- డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతలతో విస్తృత సమావేశం
- ఆలోచనాధారిత రాజకీయాలు, సామాజిక సమానత్వంపై కీలక వ్యాఖ్యలు
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజికవర్గాలకు కార్పొరేషన్ల ఏర్పాటు
- రెల్లి సామాజికవర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ అవసరమని స్పష్టం
- పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల వారికి కూడా సముచిత అవకాశాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలో జరిగిన జనసేన పార్టీ పదవి–బాధ్యత కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నామినేటెడ్, వివిధ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఆలోచనాధారిత రాజకీయాలు, సామాజిక సమానత్వం, బాధ్యతాయుతమైన నాయకత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సామాజికవర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ‘రెల్లి’ సామాజికవర్గానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
Beer Bottle Christmas Tree: ఇదేందయ్యా ఇది.. ఖాళీ బీర్ బాటిళ్లతో క్రిస్మస్ ట్రీ..!
Also Read
- Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
- Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
- OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
- Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
పట్టణ ప్రాంతాల వారికే కాకుండా గ్రామీణ ప్రాంతాల వారికి కూడా సముచిత అవకాశాలు కల్పించామన్నారు. “పదవి చిన్నదా పెద్దదా కాదు… బాధ్యత గొప్పది” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పదవులు ఇస్తున్నామని తెలిపారు. ఈరోజు దాదాపు 4000 మంది జనసేన నేతలు వివిధ పదవుల్లో ఉన్నారు అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విజయం కాదని, జనసేన భావజాలం, పోరాట పటిమకు నిదర్శనమని అన్నారు.
ఒక వ్యక్తిని గెలుపు లేదా సుఖాల్లో అంచనా వేయలేమని, ఓటమిలో ఎలా నిలబడతాడన్నదే నిజమైన కొలమానం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పార్టీ ఓడిపోయిన సమయంలో కూడా నాయకులు, కార్యకర్తలు బలంగా నిలబడ్డారని, అందుకే నేడు వారికి పదవులు దక్కాయన్నారు. పెద్ద సంఖ్యలో జనసేనకు నామినేటెడ్ పదవులు వచ్చాయని, ఇంకా కొన్ని త్వరలో రానున్నాయని తెలిపారు. పార్టీ నిర్మాణం చాలా కష్టమైన ప్రక్రియ అని, అందుకే ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నానన్నారు. రీజనల్ పార్టీలు సాధారణంగా ఎన్నికల కోణంలోనే ఆలోచిస్తాయని, కానీ దేశం కోసం పనిచేయాలనే తపనతోనే జనసేన పార్టీని స్థాపించానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
భారత్‌లో Poco కొత్త M-సిరీస్ స్మార్ట్ఫోన్లు.. Poco M8, M8 Proపై భారీ అంచనాలు..!
సమాజంలో సమస్యల వల్ల రక్తం మరిగిన యువతకు సరైన రాజకీయ వేదికలు లేకపోతే వారు నక్సలిజం వైపు వెళ్లే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి యువతకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడే వేదికగా జనసేన ఉండాలన్నదే తన లక్ష్యమన్నారు. “రెండు మూడు కులాలే శాసిస్తాం అంటే అది కుదరదు” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను కులం కోసం పార్టీ పెట్టలేదని, ఒకే కులానికే పరిమితం చేస్తే తనకు చాలా బాధ కలిగేదని చెప్పారు. జనసేన భావజాలం విస్తృతంగా పెరుగుతుందే తప్ప తగ్గేది కాదని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీని స్థాపించినప్పుడు నిర్ణయించుకున్న ఏడు సిద్ధాంతాల ప్రకారమే పార్టీ నడుస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గెలుపు, ఓటములు పార్టీ బలాన్ని నిర్ణయించవని, కష్టకాలంలో పార్టీ ఎలా నిలబడుతుందన్నదే అసలైన ప్రమాణమని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
-
OTR: నరసాపురంలో కాపుల అసంతృప్తికి అసలు కారణం ఇదేనా..?
-
Off The Record: వనపర్తి కాంగ్రెస్‌లో రగులుతున్న లొల్లి! ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన చిన్నారెడ్డి
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!