Pawan Kalyan: పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్థులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతిరోజూ స్కూలుకు వెళ్లేందుకు వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు పవన్. వెంటనే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
iPhone 17e Launch: డైనమిక్ ఐలాండ్, సరికొత్త చిప్.. అతి తక్కువ ధరలో ‘ఐఫోన్ 17ఈ’!
ఈ వీడియో తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడిన పవన్ కళ్యాణ్, అంచనాలు రూపొందించి తక్షణమే రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షల అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ జారీ అయ్యింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లి నుంచి నిత్యం స్కూలులకు వెళ్లే విద్యార్థులు, పొలాలకు వెళ్లే రైతుల కష్టాలు తీరనున్నాయి.
BOB IT Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. అర్హత, శాలరీ పూర్తి వివరాలివే
