కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అనంతరం వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మల్లవల్లి రైతుల్లో ప్రతి ఒక్కరికీ పరిహారం అందేవరకు జనసేన అండగా ఉండి పోరాటం చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా మల్లవల్లి రైతులకు టీడీపీ కూడా అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ ఇక్కడ రైతులకు అండగా నిలవాలని కోరుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రైతులకు కులాలు అంట గడితే టీడీపీ ఖండించాలని పవన్ అన్నారు.
Big Breaking: ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూత
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావటం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పరిశ్రమల కోసం గత ప్రభుత్వం రైతుల నుంచి 1,400 ఎకరాలు తీసుకుందని చెప్పారు. మల్లవల్లిలోని 125 మంది రైతులకు నేటికీ పరిహారం అందలేదని తెలిపారు. భూమి ఏ ఒక్కరిదీ కాదని అన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు.