NTV Telugu Site icon

Pawan Kalyan: కష్ట సమయంలో ప్రధాని మోడీ స్పందన మరువలేనిది

Pawan Kalyan

Pawan Kalyan

ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గత కొద్ది రోజుల క్రితం అగ్రిమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ను అక్కడి ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స అందించారు. తన కొడుకును చూసేందుకు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. కాగా ఇవాళ మార్క్ శంకర్ తో ఇండియాకి తిరిగొచ్చారు పవన్ కళ్యాణ్ దంపతులు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Also Read:Sudan: సూడాన్‌లో పారామిలిటరీ దళాల విధ్వంసం.. 114 మంది మృతి

“నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదంలో చిక్కుకుని గాయాలపాలు కావడంపై స్పందించిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు.. జనసైనికులకి, సీనీరంగంలోని నా శ్రేయోభిలాషులకి ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.. మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. మీ అందరి హృదయపూర్వక మెసేజ్ లు మాకు ఎంతో బలాన్నిచ్చాయి.. నేను ఆదివాసీ ప్రాంతాలలో పర్యటనలో ఉండగా నా కుమారుడికి ప్రమాదం జరిగింది..ఆ సమయంలో ప్రధాని మోడీ స్పందన ఎంతో ధైర్యాన్నిచ్చింది.. సింగపూర్ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించారు..

Also Read:Lenin : ఎవరూ ఊహించని రీతిలో అఖిల్‌ పాత్ర ..

కష్ట సమయంలో ప్రధాని మోడీ స్పందన మరువలేనిది.. అడవి తల్లి బాట అనేది ప్రధాని ఆలోచనలలో ఒక భాగం.. PM JANMAN, PMGSY, MGNREGS సహకారంతో ఇది సాధ్యపడింది.. 1005 కోట్లతో 1069 కిలోమీటర్ల రోడ్లు పూర్తవుతాయి.. 601 ఆదివాసీ ప్రాంతాలకు రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తుంది.. డోలీ కష్టాల నుంచీ ఆదివాసీలకు ఊరట లభిస్తుందని” సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.