Site icon NTV Telugu

Hari Hara Veera Mallu: “హరి హర వీరమల్లు”పై క్రేజీ అప్డెట్.. షుటింగ్‌కి హాజరైన పవన్ కళ్యాణ్‌..

Hariharaveeramallu

Hariharaveeramallu

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్​ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్‌ 1 : స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ​తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే మొదటి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.

READ MORE: CM Chandrababu: రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెలలోనే అన్నదాత పథకాన్ని ప్రారంభిస్తామ్న సీఎం

తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై చిత్ర యూనిట్ ఓ అప్డెట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ నేడు ఆదివారం రోజు హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు షూటింగ్‌లో ఉంటారని తెలిపింది. “చాలా కాలంగా ఎదురుచూస్తున్న, ఎక్స్‌ప్లోజివ్ ట్రైలర్, ఎలక్ట్రిఫైయింగ్ పాటల కోసం సిద్ధంగా ఉండండి! తుఫానుకు కౌంట్‌డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.” అని ప్రొడ్యూసర్ ఎ. ఎం. రత్నం ట్వీట్ చేశారు.

READ MORE: Aligarh Plane Crash: తృటిలో తప్పిన పెనుప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా గోడను ఢీకొన్న శిక్షణ విమానం

Exit mobile version