Site icon NTV Telugu

Pawan Kalyan: వారాహిపై బయల్దేరిన పవన్.. గజమాలతో గ్రాండ్ వెల్ కం

Pspk

Pspk

బందరు రోడ్లన్నీ జనసైనికులతో కిక్కిరిసిపోయాయి. జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మచిలీపట్నంలో భారీ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో తన ప్రచార రథం వారాహి వాహనంపై అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు క్రేన్ ద్వారా గజమాల వేశారు అభిమానులు.. జనసేన శ్రేణులతో కిక్కిరిసింది బెజవాడ బందరు రోడ్డు.. మూడు కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో వైపు భారీ ర్యాలీగా మచిలీ పట్నం బయల్దేరిన పవన్ కు జనసైనికులతో అపూర్వ రీతిలో స్వాగతం చెబుతున్నారు. జనసేన శ్రేణులతో కలిసి ర్యాలీ లో పాల్గొన్న గబ్బర్ సింగ్ సినిమా అంత్యాక్షరి టీమ్ సందడి చేస్తోంది.

Read Also: India On Pakistan: మళ్లీ కాశ్మీర్ ప్రస్తావన.. పాక్ “టెర్రరిస్టుల ఎగుమతిదారు” అంటూ భారత్ ఆగ్రహం

అంతకుముందు విజయవాడ నోవాటెల్ నుంచి ఆటో నగర్ బయల్దేరారు జనసేన అధినేత పవన్.. దీంతో బెజవాడ బందరు రోడ్డులో స్తంభించింది ట్రాఫిక్.. ఆటో నగర్ వచ్చి వారాహి వాహనంపై మచిలీ పట్నం వెళ్లనున్నారు పవన్. మచిలీపట్నం బహిరంగసభ ప్రాంతానికి చేరుకుంటున్న జనసైనికులతో అక్కడ కోలాహలం ఏర్పడింది. సాయంత్రం 5 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు పవన్ కల్యాణ్..విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీగా ఫ్లేక్సీలు ఏర్పాటు..దూరప్రాంతాల నుండి వచ్చే జనసైనికుల కోసం భోజన సదుపాయం ఏర్పాటుచేశారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు.

Jsp 1

ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సభ ప్రాంగణం వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటయింది. భారీగా పోలీసు బలగాలు మోహరించారు.. పోలీసు బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పి జాషూవా..పలు సూచనలు చేశారు. ఆంక్షల గురించి వివరించారు. విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి సూచనలు చేసిన ఎస్పి.. 400 మంది పోలీసు సిబ్బంది తో బందోబస్తు. సిసి కెమెరాల పర్యవేక్షణలో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. పోలీసు ప్రత్యేక సిసి కెమెరా వాహనం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. బైక్ ర్యాలీలు లాంటి వద్దని పోలీసులు సూచించారు.

Read Also:Kane Willamson : ఐపీఎల్ కోసం వన్డే సిరీస్ కు కివీస్ కెప్టెన్ దూరం..

Exit mobile version