Site icon NTV Telugu

Pawan Kalyan : అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోంది

Pawan

Pawan

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలని, ఇందులో భాగంగానే కులాల మధ్య అంతరాలు తగ్గించి సఖ్యత పెంచేందుకు జనసేన కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘కులాల మధ్య అంతరాలు తగ్గించి… అందరి మధ్య సఖ్యత పెంచేందుకు జనసేన పార్టీ తపిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు భిన్నంగా అధికార పక్షం కుయుక్తులు పన్నుతోంది. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి సమాచారం అందుతోంది. ఈ కుతంత్రాలు తిరుపతి నగరంలో మొదలయ్యాయి. బలిజలు, యాదవుల మధ్య సఖ్యతను విచ్ఛిన్నం చేసేలా కొందరు అధికార పార్టీ వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి.

Also Read : IND VS AUS: టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకున్న పాండ్యా

ఈ ఉచ్చులో ఎవరూ పడకుండా… ఆ విధమైన కుతంత్రాలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కులాల మధ్య చిచ్చులు రేపి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే బలిజలకీ, యాదవుల మధ్య దూరం పెరిగేలా కుట్రలకు తెర తీశారు. ఆ కులాల్లోనూ వర్గాలు ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని దెబ్బ తీసి తాము ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారు. ఈ రోజు తిరుపతి కావచ్చు… రేపు మరొక ప్రాంతం కావచ్చు. ప్రజల మధ్య సఖ్యత లేకుండా.. భేదభావాలతో ఉండేలా చేయడమే కుట్రదారులు పన్నాగం. ఈ తరుణంలో అన్ని కులాలవారూ… ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటివారికి ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం ఇవ్వాలి. అందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రజల మధ్య దూరం పెంచే కుట్రదారుల చర్యలను నిరసించాలి.’ అని ప్రకటనలో పవన్‌ పేర్కొన్నారు.

Also Read : Comedian Khyali Saharan: మద్యం మత్తులో యువతిపై హాస్యనటుడు అత్యాచారం

Exit mobile version