NTV Telugu Site icon

Pawan Kalyan OG: మరోసారి OG సినిమా పోస్ట్‌పోన్ తప్పదా..? అసలు విషయం ఏంటంటే..!

Og

Og

Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో OG సినిమా ఒకటి. ప్రముఖ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ కి ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఈ ఏడాది నుండి తాను చేయబోయే సినిమాలపై పూర్తిగా ఫోకస్ చేసి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రానికి పనులు పూర్తి చేసి, ప్రస్తుతం OG చిత్రానికి డేట్స్ కేటాయించారు.

Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్కు షాక్ ఇచ్చిన అమెరికా కోర్టు.. ‘లిబరేషన్ డే’ టారిఫ్‌ పథకానికి బ్రేక్..!

ఇక తాజాగా OG సినిమా మళ్లీ షూటింగ్ మొదలవగా.. అందులో పవన్ కళ్యాణ్ ముంబై షెడ్యూల్‌లో పాల్గొన్నారు. రెండు రోజుల క్రితమే ముంబైలో సినిమా షూట్ జరుగుతుండగా.. అక్కడి నుండి పవన్ ఫొటోలు, వీడియోలు లీక్ కావడం ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచింది. పవన్, OG టీం మళ్లీ ఫుల్ స్పీడ్‌కి వచ్చారని భావించిన అభిమానులుకు ఇప్పుడు మళ్లీ నిరాశ తప్పేది లేదనట్లు అర్థమవుతుంది. అవును మీరు విన్నది నిజమే.. ఈసారి OG చిత్రానికి బ్రేక్ పడటానికి కారణం హీరో పవన్ కళ్యాణ్ కాదు.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ.

ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ తాజాగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ బెడ్ రెస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే ఇమ్రాన్ హష్మీతో కొన్ని సింగిల్ పోర్షన్ సన్నివేశాలు చిత్రీకరించినా, పవన్ కళ్యాణ్‌తో కలసి ఉండే కీలక సన్నివేశాలు చేయాలిస్ ఉంది. అయితే, డాక్టర్లు పూర్తి విశ్రాంతి అవసరం అని సూచించడంతో ఆయన షూటింగ్‌కు అందుబాటులో లేరని సినిమా యూనిట్‌కు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పవన్, చిత్రబృందం కూడా ఆరోగ్యమే ప్రధానమని భావించి ఇమ్రాన్ పూర్తిగా కోలుకున్న తర్వాతే పవన్‌తో కలసి సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించారు.

Read Also: SA vs Ban: గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్

కాకపోతే, పవన్ మరోసారి డేట్స్ ఇవ్వగలరా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే, ఇప్పుడు హీరో, విలన్ కాంబోలో లేని సీన్స్‌ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ, ప్రధాన భాగం వాయిదా పడటం వల్ల OG సినిమా సెప్టెంబర్ 25 విడుదల తేదీకి సిద్ధమవుతుందా? లేదా? అనే దానిపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. చూడాలి మరి ఇమ్రాన్ హష్మీ ఆరోగ్యంగా తిరిగి షూటింగ్‌కి హాజరయ్యాక, మిగిలిన పార్ట్ వేగంగా పూర్తవుతుందన్న నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు చిత్ర బృందం.