NTV Telugu Site icon

Pawan Kalyan: బాప్టిస్ట్ చర్చిలో పవన్‌ ప్రత్యేక ప్రార్థనలు.. అన్ని మతాలను గౌరవిస్తాను

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పిఠాపురం పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సమావేశాలు, బహిరంగ సభలు, సమీక్షలు, ప్రార్థనలు ఇలా సాగుతోంది ఆయన పర్యటన.. ఎన్నికల ప్రచారానికి తాను బరిలోకి దిగుతోన్న పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టిన ఆయన.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడుతోన్న విషయం విదితమే కాగా.. నాల్గో రోజు పిఠాపురం పర్యటనలో భాగంగా నేడు స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా భార్య క్రిస్టియన్ అని గుర్తుచేశారు.. అయితే, నేను ఎన్నికల కోసం చర్చికి రాలేదని స్పష్టం చేశారు. తనను తాను తగ్గించుకునువాడు హెచ్చించును అన్నారు. ఇక, మా కుటుంబంలో సర్వ మతాలను గౌరవించేవారు.. అన్ని మతాలను నేను గౌరవిస్తాను అన్నారు. అంతేకాదు.. జీసస్ నడిచిన బెత్లెహేముకి కూడా నేను వెళ్లానని తెలిపారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌.

Read Also: Tamilisai: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెలంగాణ మాజీ గవర్నర్..

మరోవైపు, ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల తర్వాత యు. కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు బయలుదేరారు పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం కానున్నారు జనసేనాని.. ఇక, నేటితో పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన ముగియనుండగా.. రేపు తెనాలిలో పర్యటిస్తారు.. 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.